ఎందుకనో ఏమిటో
మొగ్గే రాలిపోతోంది
పూవై పూయక ముందే
మొక్కే వాడిపోయింది
తెలిసి తెలియని వయసున, ఎదిగి ఎదగని మనసుకు
చెరిగీ చెరగని గురుతులు మిగిలెను
ఎందుకు ???
జాలే తెలియని విధి రాసిన కటినపు మాటల ఈ తల రాతని
మార్చే శక్తి ని ఇవ్వడు దేవుడు
ఎందుకు ???
ముద్దాడేందుకు అమ్మ ఏది ?
నను ఎత్తుకునే నాన్న ఏడి ?
కొట్లడేందుకు అన్న ఏడి ?
లేరిక
ఎందుకు?
నను హత్తుకునే చేతులేవి ?
నను నిద్ర పుచ్చే పాటలేవి ?
నాకు ధైర్యం కలిగించే మాటలేవి ?
లేవిక
ఎందుకు?
No comments:
Post a Comment